Find and Replace in Story
You know not what happens when and where.
1.The Preamble.
( This episode is Dialogue-based, it Explodes less )
***
అప్పుడు నేను నిజామాబాద్ నుంచి డీలక్స్ బస్ లో మధ్యాహ్నం హైదరాబాద్ కి బయలుదేరాను. మూడున్నర నాలుగు మధ్యలో బస్ దొరికింది. బస్ కి ఎడమవైపు మధ్యలో విండో సీట్ దొరికింది.
నా పక్కన యింకా యెవరూ రాలేదు. యెట్లాగూ నా ఖర్మ బాగోదు కాబట్టి యే అమ్మాయిని expect చేయలేను.
అంత అదృష్టం తట్టే అవకాశం కూడా లేదు.
ముందే ఆశపడి భంగపడటం యెందుకని మొఖంపై కర్చీఫ్ వేసుకుని కళ్ళు మూసుకున్నాను. బయట వేడిగా వున్నా లోపల చల్లగా వుంది. బస్ యింకా పూర్తిగా నిండలేదు. జనం మెల్లిగా వస్తున్నారు. మధ్యాహ్నం సరిగా తినలేదు,
కొద్ధిగా ఆకలిగా వుంది.
యెందుకో ఒకసారి కళ్ళు తెరిచి చూశాను. యెవరో పెద్దాయన పెద్ద బొజ్జతో ఆయాసపడుతూ నాదగ్గిరకొచ్చి నా పక్క సీట్ గురించి వాకబు చేశాడు.
నాకే యిలా యెందుకు జరుగుతుంది అనిపించింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. చప్పున తట్టింది. ఇది రిజర్వ్ సీట్ అన్నాను. అతను తిరస్కారంగా చూసి వెనక్కి వెళ్ళాడు. హమ్మయ్య అనుకున్నాను. యింకా యెంతమంది నుంచి కాపాడాలో. అసలు అమ్మాయే రాకపోతే. అలా యింకో యద్దరినీ వెనక్కి పంపించాను. యింక విసుగొచ్చి కర్చీఫ్ మొహంపై వేసుకునేలోపు చప్పున ఆశర్యపోయి ముందుకు వంగాను.
అప్పుడే ఓ అమ్మాయి లేత మెరూన్
చుడీదార్ లో లోనికొచ్చింది.
ఆమెని చూసి ఒక్కసారి మతిపోయింది. అచ్చంగా హీరోయిన్ అంజలిలా వుంది.
పాలమీగడ లాంటి రంగు, మంచి పొడగరి, 26 కి అటూ ఇటూ. మంచి ఫిట్ గా వెనకాల bagpack తో లోనికిచ్చింది.
డ్రైవర్ తో యేదో మాట్లాడుతోంది.
అసలు యిలాంటి అమ్మాయిని చూడటమే చాలా అరుదు, అలాంటిది నా పక్కన వచ్చి కూర్చుంటుంది అని అనుకోవటం పెద్ద వెర్రి ఆశ. అసలు యీమె బస్ ఎక్కకున్నా బావుండేది కదా, అనవసరంగా కనబడి గుండెల్లో అలజడి రేపింది.
ముందు వరుసలో యెడమ వైపు వున్న
సీట్లో యెవరో gent కూర్చుని వున్నాడు. ఆ అమ్మాయి డ్రైవర్ తో యేదో మాట్లాడింది. డ్రైవర్, సీట్లో కూర్చుని వున్న అతనితో యేదో మాట్లాడాకా అప్పుడు అమ్మాయి బ్యాగ్ ఒళ్ళో పెట్టుకుని అతని పక్కన కూర్చుంది.
యింకేముంది, సినిమా అయిపోయింది, అసలు నేను ఆశ పడటమే దండగ. అతనికి బంపర్ ఆఫర్. వచ్చేటప్పుడు నక్కని తొక్కి వచ్చాడేమో. గారెల బుట్టలో పడ్డాడు.
నేను నిట్టూర్చి మళ్ళీ కర్చీఫ్ ని ముఖంపైకి లాక్కుని కళ్ళు మూసుకున్నాను.
బస్ కదిలింది. బస్టాప్ లోంచి బయటికొచ్చి మెల్లిగా ట్రాఫిక్ లోంచి వెళుతోంది బస్సు.
కిటికీ కొద్దిగా తెరిచాను. బయటనించి గాలి వేడిగా కొడుతోంది.
యెందుకో కళ్ళు తెరిచాను. అక్కడ ముందువరసలో ఆ అమ్మాయ్ నుంచుని, డ్రైవర్ హెల్పర్ తో యేదో మాట్లాడుతోంది. అతనేదో చెబుతున్నాడు. మళ్ళీ ఏమైందబ్బా అనుకున్నాను. ఆమె బ్యాగ్ వెనకాల వేసుకుంది. మావైపు ఆ హెల్పర్ వస్తున్నాడు. ఆమె వెనకాల వస్తోంది. నా గుండె వేగం పెరిగింది. ఏం జరుగుతోందో యేమీ అర్థం కావటం లేదు. ఆ హెల్పర్ నా దగ్గిరకు వచ్చి ఆగాడు. యిక్కడ ఖాళీగా వుంది కూర్చుంటారా మేడమ్ అన్నాడు.
ఆ అమ్మాయి నా వైపు చూసింది.
నేను తల తిప్పుకున్నాను. తను బ్యాగ్ సర్డుకుని సీట్లో కూర్చుంది.
***.
నాకు కాసేపు బుర్ర పనిచేయలేదు. యిన్ని సంవత్సరాల ప్రయాణంలో యిలా యెప్పుడూ
జరిగింది లేదు. యింత అందమైన యువతిని యింత దగ్గిరగా చూడాలంటే గుండె దడగా వుంది. తను క్యాజువల్ గా వుంది. బ్యాగ్ లోంచి హెడ్ ఫోన్స్ తీసుకుని మొబైల్ కి కనెక్ట్ చేసి యేవో చూస్తోంది. నేను కర్చీఫ్ మొహంపై వేసుకుని కళ్ళు మూసుకున్నాను.
***
కాసేపటికి తను ఫోన్లో యేవో మాట్లాడుతూ వుంది. తల తిప్పి చూశాను. తను ఫోన్లో ఎవరితోనో గట్టిగా మాట్లాడుతూ వుంది.
అబ్బా, యెన్ని సార్లు చెప్పాలి, వొస్తున్నాను కదా, వచ్చేసరికి చీకటి పడుతుంది.
నువ్వు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయకు అని చిరాకు పడుతోంది. నేను మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. అందమైన అమ్మాయి పక్కన కూర్చున్నంత మాత్రాన ఉపయోగం లేదు, ఏదన్నా ఆమెతో కెమిస్ట్రీ వర్కవుట్ అయితేనే యీ జర్నీకి ఒక అర్థం వుంటుంది.
అప్పుడప్పుడూ బస్సు కదలికలకు ఆమె మెత్తని భుజం నా కుడి భుజానికి తగులుతోంది. ఆమె యేమీ పట్టించుకున్నట్టు లేదు. నేను మగతగా కళ్ళు మూసుకునే సమయానికి నన్ను యెవరో తడుతున్నట్టు అనిపిస్తే కళ్ళు తెరిచాను.
ఆమె నాకు lays పాకెట్ offer చేసింది.
నేను వొద్దన్నాను. తను వెనక్కి తీసుకుంది. నాకు చాలా పొగరు అని ఆమె కళ్ళే చెబుతున్నాయి. యేమైనా, అందమైన అమ్మాయిని reject చేస్తే వాళ్ళ ఇగో బాగా hurt అవతుంది. కాసేపటికి ఆమెతో మాటలు కలుపుదామని తిరిగాను. తను మొబైల్ లో బిజీగా వుంది. నేనడిగాను,
చిప్స్ పాకెట్ వుందా అని.
నావైపు తిరస్కారంగా చూసి అయిపోయాయి అంది. సరే అన్నాను.
మళ్ళీ తనే
అయినా యిచ్చినప్పుడు తీసుకోవడానికి అంత పొగరు ఎందుకు
అని బ్యాగ్ ఓపెన్ చేసింది.
అప్పుడు ఆకలి లేదు అన్నాను.
యేదో సగం ఓపెన్ చేసిన డార్క్ చాక్లెట్ యిచ్చి, మీకు ఒకే అయితే తినండి, కొద్దిగా ఎంగిలి అయింది.
వావ్, ఆమె ఎంగిలి.
నేను తీసుకుని తినటం మొదలెట్టాను.
నేను చేయి చాచాను,
థాంక్యూ, నా పేరు వాసు అన్నాను.
తను చేయిచ్చి సామ్ అంది.
సామ్, ఏంటి ఆ పేరు, సమంతా? అడిగాను.
లేదు, సత్యభామ అంది నవ్వుతూ.
నేనూ నవ్వాను.
అసలు నా పేరూ వాసు కాదు.
మరి.
వారణాశి సుందర్ అని నవ్వాను.
తను పకపకా నవ్వింది,
గాలికి ఆమె ముంగురులు ముందుకు పడుతుంటే సరిచేసుకుంటూ.
యింతలో కామారెడ్డి వచ్చింది.
నేను లేస్తూ, మీకేమన్నా కావాలా అడిగాను.
తను నవ్వుతూ, సిగరెట్ కే కదా, వెళ్ళిరండి అంది నవ్వుతూ.
అబ్బే, నాకలవాటు లేదు.
అయితే ఒక స్ట్రాంగ్ కాఫీ పట్టుకురండి అని
నాకు దారిచ్చింది.
( యిప్పుడే ప్రయాణం వేగం అందుకుంది )
8389484cookie-checkVasu అనుభవాలు | Train & Bus – 5no